అంగన్వాడీ హెల్పర్లకు తీపికబురు

` వారి ప్రమోషన్‌ వయసును 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో అంగన్వాడీ హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి కోసం గరిష్ఠ వయోపరిమితిని పెంచింది.హెల్పర్‌కు ప్రమోషన్‌ వయసును 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ మహిళా శిశుసంక్షేమశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని 4,322 మందికి ప్రయోజనం కలగనుంది. ఈ అంశానికి సంబంధించిన దస్త్రంపై మంత్రి సీతక్క సంతకం చేశారు. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి.