అంగన్‌వాడిలకు పాత బకాయిలు ఇవ్వాలీ

రంగారెడ్డి: అంగన్‌వాడిలకు పెంచిన జీతాలు వెంటనే చెల్లీంచాలని, ప్రతి అంగన్‌వాడి కేంద్రానికి సెల్‌ఫోన్‌, గ్యాస్‌ సౌకర్యం కల్పీంచాలని పెట్రోల్‌ డీజిల్‌, బస్సుచార్జీలు పెంచితే ఆ రోజు అర్థరాత్రీ నుంచే అమలులోకి చేస్తున్నారని, అంగన్‌వాడిలకు మాత్రం జీతాలు పెంచిన 14నెలల నుండి అమలు చేయడం లేదని, కేంద్ర ప్రభుత్వం బడ్జేట్‌ విడుదల చేసిన, రాష్ట్ర ప్రభుత్వ అమలు చేయకుండా నాలాకాలు ఆడుతుందని, నిత్యవసర ధరలు ఆకాశాన్నంటాయని, మధ్యతరగతి వారు ఏలా జీవించ గలుగుతారని, ప్రభుత్వం నిర్లక్షం చేయాకుండా త్వరగా స్పందించాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సీ వస్తుందని  ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మన్నె నర్శింహరెడ్డి, అంగన్‌వాడి నాయకులు బోమ్మగల్ల మనీషా, దీపా, అనిల్‌, రాజ్యలక్ష్మి, జ్యోతి, బిక్షమమ్మ, వనజా, అరుణ, భారతి వసంతమాల, తదితరులు పాల్గోన్నారు.