అంగరంగ వైభవంగా ఎంగిలిపువ్వు బతుకమ్మ
తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చిన మహిళలు
జగిత్యాల జనంసాక్షి సెప్టెంబర్ 24
ఆట..పాటలతో అలరించిన ఆడపడుచులు భారీ సంఖ్యలో పాల్గొన్న మహిళ నాయకులు నేడు విద్యానగర్ బతుకమ్మ కమిటి ఆధ్వర్యంలో ఎంగిలి పువ్వు బతుకమ్మను వారి నివాసం వద్ద అంగరంగవైభవంగా ఘనంగా నిర్వహించారు.ఉదయం 8 గంటల వరకే తీరొక్క పూలతో అక్కడికి విచ్చేసిన మహిళలు… అత్యంత భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా.. బతుకమ్మలు పేర్చారు.. తంగేడు పువ్వు జిల్లేడు పువ్వు గునుగు పువ్వు బంతి చామంతి తీరొక్క పూలతో.. అందంగా బతుకమ్మలు పేర్చి అందులో పసుపు గౌరమ్మను ఉంచి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.అనంతరం బతుకమ్మ పాటలకు లయబద్ధంగా నృత్యాలు చేస్తూ కోలాటాలు వేస్తూ .. అత్యంత ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలలో పాలుపంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో విద్యానగర్ లోని మహిళలు, ఐలేని శ్యామల,మాధవి,మంజుల రాజేశ్వరి,సువర్ణ, ఉమ, మంగ,లక్ష్మీ,రజిని,వాణి,సునీత,ప్రవళిక,మౌనిక తదితరులు పాల్గొన్నారు.