అందరికీ ఆధార్‌ కార్డులివ్వాలి

హైదరాబాద్‌: రాష్ట్రంలో అందరికి ఆధార్‌ కార్డులిచ్చేందుకు కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని పౌరసరఫరాలశాఖ అధికారులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో ఆధార్‌ పధకం పై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆధార్‌ ద్వారా ప్రభుత్వ పథకాలు అబ్దిదారులకు అందేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో హైదరాబాద్‌, చిత్తూరు, ఆనంతపురం, తూర్పుగోదావరి, రంగారెడ్డి జల్లాల్లో ఆధార్‌ కార్డుల పంపిణి పూర్తయినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.