అంబేద్కర్‌ వర్సిటీలో ప్రవేశాలకు చివరి గడువు

హైదరాబాద్‌: బి.ఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు సంబంధించి ఆఖరు గడువును విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్‌ ఎ. సుధాకర్‌ వెల్లడించారు. ”బీ.ఏ/బీకాం/బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 25 చివరి తేదీ  కాగా… రూ.200 అపరాధరుసుంతో సెప్టెంబరు 5 వరకు అవకాశం ఉంటుంది..” అని తెలియజేశారు. దీనికి 2008 నుంచి 2012 వరకు అర్హత పరీక్ష ఉత్తీర్ణులైన విద్యార్థులు, ఇంటర్‌ పూర్తి చేసిన వారు కూడా సంబంధిత అధ్యయన కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఫీజీ, డిప్లొమా కోర్లులను కూడా వర్శిటీ అందిస్తోందని దీనికి సెప్టెంబర్‌ 12లోపు దరఖాస్తు చేయాలన్నారు.