అకిషా ఫౌండేషన్ చైర్మన్ బండేపల్లి సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాదుడిని మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్,

   సికింద్రాబాద్ (జనం సాక్షి ):       ప్రధమ పూజితుడైన గణనాధుడు ఆశీస్సులు అందరిపై ఉండాలని, విఘ్నాలు తొలగి విజయాలు కలగాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
చిలకలగూడ మున్సిపల్ మైదానంలో అకిషా ఫౌండేషన్ చైర్మన్ మరియు కంటేస్టేడ్  ఎమ్మెల్యే బండేపల్లి సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాదుడిని మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..మహా హారతి కార్యక్రమంలో పాల్గొని గణనాధుడు ఆశీస్సులు పొందారు.. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను అఖీషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం సంతోషకరమని అన్నారు.. హిందూ ధర్మం ప్రకారం మొదటి పూజ గణనాథుడికి నిర్వహిస్తూ విజయాలు కలుగుతాయని అన్నారు.. తెలుగు ప్రజలందరికీ ఈ సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.. గణనాథుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని దేశమంతా సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు.. కేంద్ర మాజీ మంత్రి వర్యులు  ప్రకాష్ జవదేకర్   మాట్లాడుతూ బండపల్లి సతీష్ ఏర్పాటు చేసిన గణపతిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు, దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యామసుందర్, గౌతంజి, మోండా డివిజన్ కార్పొరేటర్  కొంతం దీపికా, వెంకట్ రమణి, హరి, వెంకటేష్ గౌడ్,  శారదా మల్లేష్, శ్రీనివాస్ చారి, మహేష్, వినయ్, శ్రీనివాస్, ప్రశాంత్ రెడ్డి, రవీందర్, వంశీ, కుషాల్, భానుమతి పాల్గొన్నారు.