అక్టోబర్ రెండునుంచి ఉదృతంగా సురాజ్య ఉద్యమం: జేపీ
హైదరాబాద్: అక్టోబర్ 2నుంచి డిసెంబర్ 9 వరకు సురాజ్య ఉద్యమాన్ని ఉదృతంగా నిర్వహిస్తామని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ తెలియజేశారు. సురాజ్య ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియా సహకారం కోరుతూ ఆయన ఈ రోజు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సేవలు ప్రజల హక్కుగా గ్రామస్థాయినుంచి సురాజ్య ఉద్యమాన్ని చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా అన్ని కళాశాలలు, గ్రామాల్లో చర్చలు, సమావేశాలు నిర్వహిస్తామని, కమిటీలు వేసి నిరంతర ప్రక్రియగా ఉద్యమం సాగిస్తామని ఆయన చెప్పారు.