అక్బరుద్దీన్‌పై కేసు

న్యూఢిల్లీ, జనంసాక్షి :

మజ్లిస్‌ పార్టీ శాసన సభ్యుడు అక్బరుద్దీన్‌ ఓవైసీపై దేశ రాజధాని పార్లమెంటరీ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో జరిగిన ఎంఐఎం బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు లౌకిక, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలపై దాడి చేశాలా ఉన్నాయంటూ సామాజిక కార్యకర్త షబ్మమ్‌ హష్మీ ఆయనపై ఫిర్యాదు చేశారు. శాంతిని భంగపరచడం వంటి ప్రసంగాలు చేయడం సరికాదని, ఇలాంటి వ్యాఖ్యలు సమాజంపై దుష్పప్రభావం చూపుతాయని ఆయన తెలిపారు. షబ్మమ్‌ హష్మీ ఫిర్యాదు మేరకు భారత శిక్షాస్మృతి 153ఏ సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.