కోడేరులో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్

నవంబర్ 13(జనంసాక్షి):కొల్లాపూర్ : నాగర్ కర్నూర్ జిల్లా కోడేరు మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలిగింది. జూబ్లీహిల్స్ ఎన్నికలకు ఫలితాలతో సంబంధం లేకుండానే రాష్ట్రంలో వచ్చేది, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేది బీఆర్ఎస్ పార్టీయే మాత్రమేనని నమ్మిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా గురువారం కోడేరు మండలం జంనుంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి, మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షులు శేషి రెడ్డిల ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గులాబీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు.
కొల్లాపూర్ నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు మాత్రమే ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు బెదిరింపులు మాత్రమే కనిపిస్తున్నాయన్నారు. మళ్లీ బీరం హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో మంచి పాలన కోసం, కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార పార్టీని వీడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ, బిజెపి పార్టీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన నాయకులు ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇస్తామని చెప్పిన తులం బంగారం ఎక్కడ ఉందని ప్రశ్నించారు.
420 హామీలను తుంగలోకి తొక్కారని మండిపడ్డారు. తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు మాత్రమే ఉన్నాయని కొన్నిచోట్ల తను టెండర్లను పూర్తి చేయించి శంకుస్థాపన చేసిన పనులను కూడా ఈ ప్రభుత్వం పనులను కొనసాగించకుండా పక్కన పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బవాయిపల్లి వంతెన నిర్మాణం కోసం ఆరు కోట్ల నిధులు మంజూరు అయ్యాయన్నారు. కానీ ఇంతవరకు వంతెన నిర్మాణాన్ని ప్రారంభించలేదని పేర్కొన్నారు.
కోడేరు మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం నిర్మాణం కోసం కోటి 75 లక్షలు మంజూరు చేయిస్తే ఈ ప్రభుత్వం అసమర్థతతో తాసిల్దార్ కార్యాలయానికి సొంత భవనాలు నిర్మించలేకపోతుందన్నారు. సింగోటం గోపల్ దీన్నే లింకు కెనాల్ నిర్మాణం కోసం 130 కోట్లు మంజూరు చేయించడం జరిగింది. ఈ టెండర్‌ను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాఘవ కంపెనీకి వచ్చినట్లు గుర్తు చేశారు. ఉద్దేశ పూర్వకంగానే పనులను పూర్తి చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే తన హయంలో నిధులను మంజూరు చేయించి తీసుకొచ్చిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే కోడేరు మండలంలో అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజులు మనవేనని అందరూ ధైర్యంగా ఉండాలని కార్యకర్తలకు, నాయకులకు ఆయన భరోసా కల్పించారు. అనంతరం కోడేరు మండల కేంద్రంలో పార్టీ కుటుంబాలను ఆయన పరామర్శించారు.
ఈ కార్యక్రమాలలో మాజీ సర్పంచ్‌లు శివారెడ్డి బొందయ్య, సీనియర్ నాయకులు ఇమామ్ సింగల్ విండో డైరెక్టర్ లింగస్వామి, చెట్టు యాప చెట్టు లాలు, నాయకులు భాస్కర్ రెడ్డి, కోడేరు గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీశైలం, వార్డు మెంబరు బాలస్వామి, శేఖర్ రెడ్డి, వడ్డే రాజు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.



