వరి పంట చేనులో ప్రమాదవశాత్తు కింద పడి రైతు మృతి

 

 

 

 

 

గంభీరావుపేట నవంబర్ 07(జనం సాక్షి):గజ సింగవరంకు చెందిన ధ్యానబోయిన ఇజ్జయ్య (65) రైతు వరి పంట చేను వద్ద ఆకస్మాత్తుగ కింద పడి హటన్మరణం చెందాడు. ఎకరం పొలంలో సాగు చేసిన వరి పంట ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా నేల వాలింది. పంట చేతి కి వస్తుందో లేదో అంటూ దిగులు చెంది న రైతు పంట చేనులో ఒక్కసారిగా కింద పడి అక్కడిక్కడే మృతి చెండాడు. మృతునికి భార్య లక్ష్మి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు