శివరాంపల్లి బీసీ హాస్టల్ ఖాళీ చర్యకు వ్యతిరేకంగా నిరసన

రాజేంద్రనగర్,నవంబర్13(జనంసాక్ షి)రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని ప్రభుత్వ బీసి బాలుర వసతి గృహాన్ని విద్యా సంవత్సరమధ్యలో ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించే ప్రయత్నాన్ని స్థానిక బీజేపీ నాయకులు అడ్డుకున్నారు.
ఈ చర్యను అసెంబ్లీ కన్వీనర్ కే. మల్లేశ్ యాదవ్, రాజేంద్రనగర్ బీజెపీ డివిజన్ అధ్యక్షుడు సందీప్ ముదిరాజ్, జిల్లా భాజపా ఓబీసీ మోర్చా కార్యదర్శి హరికిషన్, ప్రధాన కార్యదర్శి ఎస్. రాజశేఖర్ రెడ్డి, విజయ్ యాదవ్ తదితరులు తీవ్రంగా ఖండించారు.వారు ప్రభుత్వాన్ని వెంటనే ఈ అన్యాయ నిర్ణయాన్ని నిలిపివేయాలని, హాస్టల్‌లో అవసరమైన మరమ్మతులు సదుపాయాల అభివృద్ధి తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు.జడ్పిఎచ్ఎస్ శివరాంపల్లి పాఠశాల ఉత్తమ విద్యాసంస్థగా పేరుపొందిందని, హాస్టల్ మూసివేత వల్ల పేద విద్యార్థులు మంచి విద్యా అవకాశాన్ని కోల్పోతారని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.



