“స్వర్గానికి” దారేది..? స్మశాన వాటికకు వెళ్లేదారులు కబ్జా
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం గంట్లవెల్లి గ్రామంలో వింత పరిస్థితి నెలకొంది. చెరువులో ఉన్న స్మశాన వాటికకు పాటు కాలువ గుండా వెళ్లేదారులు మొత్తం కబ్జాకు గురికావడంతో ప్రస్తుతం స్మశాన వాటికకు ఎలా వెళ్లాలని గ్రామస్తులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గ్రామానికి చెందిన మంగలి బాలమని వయసు పైబడి చనిపోయారు. ఆమెను స్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేయాలి. కానీ గత ఎన్నో సంవత్సరాల నుండి ఆ రహదారి నుండి వెళ్లేదారి కూడా కొద్దిగా ఉండడం ఆ రహదారి కూడా ప్రస్తుతం కాలువ తీయడంతో మొత్తంగా స్మశాన వాటికకు వెళ్లేదారి లేకుండా పోయింది. ప్రస్తుతం మంగలి బాలమని డెడ్ బాడీని అంత్యక్రియల నిమిత్తం స్మశాన వాటికకు ఎలా తీసుకెళ్లాలని గ్రామస్తులు తీవ్ర ఆలోచనలు చేస్తున్నారు.



