అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలపై కేసు నమోదైంది : సీఎం

హైదరాబాద్‌: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలపై కేసు నమోదైందని సీఎం తెలిపారు. అక్బరుద్దీన్‌ కేసు విషయంలో ప్రభుత్వం జోక్యం ఉండదని స్పష్టం చేశారు. ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన వారిపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వం అందరినీ సమానంగా చూస్తుందన్నారు.