అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు:అహ్మదుల్లా

కడప: మైనారీటీ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌లో అక్రమాలకు పాల్పడినవారిపై కఠినచర్యలు తీసుకుంటామని మంత్రి అహ్మదుల్లా తెలియజేశారు. నల్లకుంట, బండ్లగూడ,  కోఠిలోని 3 శాఖల్లో రూ. 55.45 కోట్లు మాయమైనట్లు తేలిందని ఆయన వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురిని సీఐడీ పోలీసులు అరెస్టుచేసినట్లు మంత్రి చెప్పారు.