అక్రమ మట్టి తరలింపు పై అధికారుల కొరడా – నాలుగు టిప్పర్లు జెసిబి సీజ్

రుద్రంగి సెప్టెంబర్ 28 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలోని సర్వేనెంబర్ 428 ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న దానిపై అధికారులు కొరడా జులిపించరు.తాసిల్దార్ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 428 ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ కాంట్రాక్టర్ అక్రమంగా ఇలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నారని సమాచారంతో రెవెన్యూ, పోలీస్ అధికారులు బుధవారం నాలుగు టిప్పర్లు,ఒక జెసిబి పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రుద్రంగి నుండి దసరా నాయక్ తండ వరకు రోడ్డు పనులకు కాంట్రాక్టర్ ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలించడంతో.అక్రమంగా మట్టిని తరలిస్తున్న టీఎస్ 02 యూఏ 6078, ఏపీ 07 టీజీ 1888, టీఎస్ 02 6076, టిఎస్ 12 యూఏ 6573, గల టిప్పర్ వాహనాలతో పాటు జెసిబి సీజ్ చేసి స్థానిక ఎస్సై ప్రభాకర్ కు అప్పగించామన్నారు.ప్రభుత్వ భూముల్లో ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరికైనా మట్టి అవసరం ఉంటే అనుమతులు తీసుకొని మట్టిని తీసుకోవాలని ఆయన సూచించారు.