అఖిలపక్షం మరో నాటకం : విమలక్క

హైదరాబాద్‌:: కేంద్రం తెలంగాణపై 28న నిర్వహించే అఖిలపక్షం మరో నాటకమని తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ (టఫ్‌) చైర్‌పర్సన్‌ విమలక్క ఆరోపించారు. అఖిలపక్షం నిర్ణయం మేరకు మూడేళ్ల క్రితం పార్లమెంట్లో తెలంగాణ ప్రకటన  చేసిన వెనక్కిపోయిన యూపీఏ మళ్లీ ఇప్పుడు గారడీ చేస్తోందని విమర్శించారు. ఈ మేరకు ఆమె చంచల్‌గూడ మహిళా జైలు నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. 2014లోపు తెలంగాణ సాధించుకోవడం కోసం టఫ్‌ ఎవరితోనైనా కలిసి పనిచేస్తుందని విమలక్క పేర్కొన్నారు.

తాజావార్తలు