అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలి

హైదరాబాద్‌: రత్నగిరి గ్యాస్‌ తరలింపుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్రానికి ప్రేమలేఖలు రాస్తే సరిపొదని. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి దీక్ష చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి అన్ని రంగాల్లో విఫలమయ్యారని, కేవలం విహారయాత్రలకు, ఆటలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్‌ పరిస్థితి క్లిష్టంగా ఉందని ఈ సమయంలో పెట్రోలియం మంత్రిత్వశాఖ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయాలని నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.