అఖిలపక్ష భేటీ వాయిదాను ఒప్పుకోం : కవిత

హైదరాబాద్‌: తెలంగాణ పై కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న అఖిలపక్షాన్ని తేలికగా చూపించి తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. సీఎం తన కరుడుగట్టిన సమైక్యవాదాన్ని తెలంగాణ ప్రజల ముందు ప్రకటించుకున్నారని ఆమె వ్యాఖ్యాలనించారు. అఖిలపక్ష భేటీ వాయిదాను ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు.