అగ్ని ప్రమాదంలో మూడు కోళ్ల ఫారాలు దగ్ధం

తగరపువలస, విశాఖ : భీమిలి గ్రామీణ మండలం చిప్పాడు పంచాయతీ నమ్మెవానిపాలెంలో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మూడు కోళ్ల ఫారాల గోదాములు , ఓ గడ్డివాము దగ్ధమయ్యాయి. సుమారు రూ. 3 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

తాజావార్తలు