అగ్ని ప్రమాద బాధితులకు వన ప్రేమి ఆర్థిక సహాయం
కొత్తగూడ ఆగస్టు 28 జనంసాక్షి:కొత్తగూడ మండలంలోని దుర్గారం గ్రామానికి చెందిన దబ్బేటి రమేష్ స్వగృహం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలిపోవడం జరిగింది.ఇట్టి విషయం తెలుసుకున్న వన ప్రేమికులు డాక్టర్ పులుసం సాంబయ్య తన వంతు గా 25 కిలోల బియ్యం,పప్పులు,నూనెలు మొదలగు నిత్యావసర సరుకులను బాధిత కుటుంబానికి అందజేశారు.ఈ సందర్భంగా వన ప్రేమి డాక్టర్ పులుసం సాంబయ్య మాట్లాడుతూ కష్టార్జితంతో సంపాదించుకొన్న సంపద,టూవీలర్,పిల్లల ఇంటర్,టెన్త్ మెమోలు మొత్తం కాలి బూడిదై పోయాయి.సర్వం కోల్పోయిన ఈ అగ్ని ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి దాతలు,స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అగ్ని ప్రమాద బాధితులకు సహాయం అందించాలని అలాగే ప్రభుత్వ ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో దుర్గారం సర్పంచ్ సనప నరేష్,కార్యదర్శి మల్లెల కళ్యాణి,సీనియర్ ఉపాధ్యాయులు గట్టి సమ్మయ్య పాల్గొన్నారు.