అగ్రికెం సంస్థను మూసివేయాలి: కలెక్టర్‌ ఆదేశాలు

శ్రీకాకుళం: ఎచ్చెర్ల మండలంలోని నాగార్జున అగ్రికెం పరిశ్రమను వారం రోజుల్లోగా సురక్షితంగా మూసివేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఉదయం పరిశ్రమలో భారీపేలుడు జరిగి 18 మంది కార్మికులు గాయ పడిన సంగతి తెలిసిందే.