అటవీ ఉత్పత్తుల విక్రయానికి చట్టం కిశోర్
శ్రీకాకుళం, జనంసాక్షి: గిరిజనుల అటవీ ఉత్పత్తుల విక్రయానికి 2 నెలల్లో చట్టం తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ తెలిపారు. పంచాయతీ ఎన్నికలు పూర్తైన మరుక్షణమే నిధులు విడుదల చేస్తామన్నారు. గిరిజన ప్రాంతంలో గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లకుండా 12 రాష్ట్రలకు లేఖలు పంపినట్లు చెప్పారు.


