అడపిల్లకు జన్మనిచ్చే తల్లికి సన్మానం: రత్నప్రభ

 

హైదరాబాద్‌ : సామాజిక నిరాదరణకు గురైన సెక్స్‌వర్కర్లకు పునరావాసం కల్పించటంలో చిత్తశుద్ది చూపాల్సిన అవసరం ఉందని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు చెప్పారు. సెక్స్‌వర్కర్ల సమస్యలు మహిళా సాధికారతపై పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ అడ్వకసీ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ సదస్సు నిర్వహించింది. వివిధ శాఖలు మహిళల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఎవరికి వారే ఈ సేవలు అందిస్తున్నారని జాతీయమహిళా సాధికారత మిషన్‌ కార్యదర్శి రత్నప్రభ అన్నారు. మహిళల్లో ఉన్నత స్థానానికి ఎదిగే వారి సంఖ్య పెరుగుతోంది. ఇదే సమయంలో అడ శిశువుల సంఖ్య తగ్గుతుండటం విచారకరమన్నారు. అడపిల్లకు జన్మనిచ్చే తల్లికి ప్రత్యేక సన్మానంతో పాటు మహిళలకు ంర్తిచే అన్ని పథకాలు అమెకు అందేలా చేయాలన్నారు.