అతిథి అధ్యాపకుల ఆందోళన

హైదరాబాద్‌ : గురుకుల జూనియర్‌ కళాశాల, పాఠశాలల్లో అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్న వారి ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని బీసీ సంక్షేయ సంఘం నేత ఆర్‌,కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. అతిథి లెక్చరర్లు, టీచర్లు మంత్రుల నివాసాల ఎదుట ఆందోళన నిర్వహించారు. గిరిజన కళాశాలలు, పాఠశాలల్లో పదమూడేళ్లుగా పనిచేస్తున్న వీరిని ఆ శాఖ మంత్రి కావాలనే ఇబ్బంది పెడుతున్నారని కృష్ణయ్య అన్నారు. గిరిజన శాఖ అధికారులు అతిథి లెక్చరర్లు, టీచర్ల ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని సిఫార్సు చేసినప్పటికీ మంత్రి పట్టించుకోవడం లేదని ఆరోపంచారు.

తాజావార్తలు