ఉండవల్లి గ్రామంలో విజృంబించిన అతిసార-గ్రామంలోనే వైద్యశిభిరం

మహబూబ్‌నగర్‌: మానవపాడు మండలం ఉండవల్లిలో అతిసారంతో  20 మంది అస్వస్థులయ్యారు. వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటుచేశారు. అక్కడే సెలైన్లు ఎక్కించి చికిత్స చేస్తున్నారు. కొందరిని చికిత్స నిమిత్తం కర్నూలు తరలించగా వారిలో ఓ మహిళ మృతి చెందింది.