అత్యవసరంగా విమానం దించివేత

తిరుపతి: రేణిగుంట విమానాశ్రయంలో శనివారం ఉదయం స్పైస్‌జెట్‌ విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. టేకాఫ్‌ అవుతున్న సమయంలో పక్షి తగలడాన్ని గుర్తించిన అధికారులు వెంటనే విమానాన్ని దించి వేశారు.