అదుపు తప్పి కల్వర్టులో పడిన పాఠశాల బస్సు

వరంగల్‌: అదుపు తప్పిన ఓ పాఠశాల బస్సు కల్వర్టులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురి విద్యార్థులకు తీవ్ర  గాయాలయ్యాయి. ఈఘటన ఆత్మకూరు మండలం పులికుర్తి సమీపంలో  చోటు చేసుకుంది. గాయాలపాలైన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.