వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య

 

 

 

 

 

కారేపల్లి, నవంబర్‌ 14  (జనంసాక్షి)     : తనను ప్రేమించిన గ్రామీణ వైద్యుడి వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకున్నది. గ్రామస్థుల కథనం ప్రకారం.. కారేపల్లి మండ లం రేలకాయలపల్లికి చెందిన జర్పు ల సందీప్తి (20) డిగ్రీ చదువుతున్నది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ నామా నరేశ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెండ్లి చేసుకోవాలని భావించారు. ఇద్దరూ కలిసి ఫొటోలు దిగారు. ఇంతలో వీరి ప్రేమ వ్యవహారం ఆ యువతి ఇంట్లో తెలిసింది. ఆమె తల్లిదండ్రులు సందీప్తిని కాలేజీ మాన్పించి ఇంట్లోనే ఉంచుతున్నారు.

దీంతో నరేశ్‌ కూడా భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఓ రోజు ఆమెకు ఫోన్‌ చేసి, తల్లిదండ్రులకు భయపడకుండా తనను పెండ్లి చేసుకోవాలంటూ ఒత్తి డి చేశాడు. అందుకు ఆమె నిరాకరించింది. ఆమెపై కోపం పెంచుకున్న నరేశ్‌.. వారిద్దరూ గతంలో చనువుగా ఉన్నప్పుడు దిగిన ఫొటోలను తన వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టాడు. సోషల్‌ మీడియాలోనూ పోస్టుచేశాడు. ఆర్‌ఎంపీ తనను వేధిస్తున్నాడంటూ ఆ యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఈ నెల 6న కారేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గతంలో తాము కలిసి ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో తన కుటుంబ పరువు పోయిందని భావించిన సందీప్తి గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులమందు తాగింది. తరువాత గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కారేపల్లి పోలీసులు తెలిపారు.