అద్భుతం జరిగి…గెలుస్తా:సంగ్మా

న్యూఢిల్లీ:రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్ధి ప్రణబ్‌ముఖర్జీకి గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నా..ఆయన పోటి పడుతున్న పీఏ సంగ్మా విజయంపై ఆశలు వీడలేదు.రాష్ట్రపతి ఎన్నికల ఓటర్లలో 60శాతం పైగా ప్రణబ్‌కు ఇప్పటికే మద్దతు ప్రకటించినా ఏదో ఒక అద్బుతం జరిగి తానే గెలుస్తానని స్పష్టం చేశాను.ఓ వార్తా ఛానెల్‌లో మాట్లాడుతూ..తనకు మద్దతిస్తున్న వారి చేతిలో పావులా మారాననే వ్యాఖ్యాలను సంగ్మా ఖండించారు.ప్రపంచంలో అద్బుతాలు జరుగుతుంటాయనీ వాటిపై తనకు నమ్మకం ఉందన్నారు.పోలింగ్‌కు ముందే తనను తీసిపారేయవద్దనీ భగవంతుడు తనవైపే ఉన్నారనీ రాజకీయాల్లో ఏదైనా సాద్యమేనన్నారు.ఇతర పక్షాలను దగ్గరయ్యేందుకు భాజపా,ఒడిశాలోని 25% ఉండే గిరిజనులను ఆకర్షించేందుకు నవీన్‌ పట్నాయక్‌ తనను పావులా వాడుకుంటున్నారనే మాటలను ఖండించారు.తన అభ్యర్ధిత్వం దేశ లౌకికవాదానికి మేలు చేస్తుందన్నారు.భాజపా,ఏఐడీఏంకేలు గతంలో క్రైస్తవ వ్యతిరేక ధోరణిని అవలంబించాయనే విమర్శల్ని ఆయన చేసి చూపారు.రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి దిగడం ద్వారా భారత పౌరుడిగా తన హక్కును ఉపయోగించుకుంటున్నా అన్నారు