అధికారంలో ఉండి ఏటీయూసీ ఏం సాధించింది

కాకతీయఖని, జూన్‌ 6 :
మూడుసార్లు గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటీ యూసీ కార్మికులకు ఏం సాధించిందో చెప్పాలని ఏఎన్‌టీయూసీ కేంద్రకమిటీి డిప్యూటి ప్రధాన కార్యదర్శి డాలయ్య ప్రశ్నించారు. వారి హయాం లో డిపార్టుమెంటులు, గనులు, గెస్ట్‌హౌజ్‌లను ప్రైవేటుపరం చేశాయని విమర్శించారు. బుధ వారం ఏరియాలోని కేటీకే 2వ గని ఆవరణలో జరిగిన గేట్‌మీటింగ్‌కు కొక్కుల తిరుపతి అధ్యక్షత వహించగా డాలయ్య మాట్లాడుతూ ఏఐటీయూసీ కి కార్మికులను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. కార్మికులను ఇంటికి పంపించే కుట్ర లు పన్నుతూ, అధికారం కోసం అర్రులు చాస్తున్న ట్లు చెప్పారు. ఐఎనటీయూసీికి బలమైన క్యాడర్‌ ఉందని కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో కాం గ్రెస్‌ ప్రభుత్వం ఉందని కొత్త హక్కులు రావాలన్న, ఉన్న హక్కులు రక్షించబడాలన్న అది మాతోనే సాధ్యమన్నారు. ఏఐటీయూసీ ఎన్‌ఎంఏ ఎత్తివేసి కార్మికులకు తీరని దోహం చేస్తే తిరిగి ఐఎనటీ యూసీ ఇప్పించిందన్నారు. అండర్‌గ్రౌండ్‌ గనుల ను ఎత్తివేసి ఓపెన్‌కాస్టులకు ద్వారాలు తెరిచింద ని, కాంట్రాక్టు కార్మికలను అండర్‌గ్రౌండ్‌లోకి దిం పినట్లు యంత్రాలు సైతం ప్రవేశిస్తుంటే నోరుమెది పిన పాపాన పోలేదని అన్నారు. ఐఎన్‌టీయూసీని గెలిపిస్తే వారసత్వ ఉద్యోగాలను తిరిగి ఇప్పిస్తామ ని, 25 శాతం లాబాలవాటాను పెన్షన్‌ను 40శా తం పెరిగేలా కృషి చేస్తామని డాలయ్య తెలిపారు. కొక్కుల తిరుపతి మాట్లాడుతూ స్థానిక కార్మికు లకు తాగునీటి సరఫరా మెరుగుపరుస్తామని, మూడు నెలల్లో భూపాలపల్లిని మున్సిపాలిటిగా రూపాంతరం చెందిస్తానని హామీ ఇచ్చారు. కార్మి కుల నివాస సౌకర్యార్థం అదనంగా క్వార్టర్ల నిర్మా ణం జరిపిస్తానని స్పష్టం చేశారు. సింగరేణి ఎన్ని కలకు, రాజకీయ ఎన్నికలకు ముడిపెట్టవద్దని వివ రించారు. సమావేశంలో నాయకులు చల్ల జక్కి రడ్డి, రత్నం సమ్మిరెడ్డి, గోపాల్‌రావు, రాజయ్య, లింగయ్య, కనకయ్య, శంకర్‌, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.