అధికారికంగా భూపతి జయంతి

హైదరాబాద్‌,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ):  స్వరాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమ నేత, తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి పుట్టినరోజును ఈ నెల 21న అధికారికంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న భూపతి కృష్ణమూర్తి ఆదివారం  వరంగల్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. స్వరాష్ట్రం వచ్చే వరకు కన్నుమూసేది లేదని ప్రతిన బూనిన భూపతిఅనుకున్నట్టే తెలంగాణ రాష్టాన్న్రి కళ్లారా చూసిన ధన్యుడన్నారు. భారత స్వాతంత్య ఉద్యమ సారథి మహాత్మాగాంధీతో అనుబంధం ఏర్పరచుకోవడం నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఆయన అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. 1969 ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి భూపతి కృష్ణమూర్తి అని అన్నారు. మలిదశ ఉద్యమంలో ఆయన నాకు ఎన్నో సలహాలు, సూచనలను ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.  ఆయన సేవలను ప్రభుత్వం గుర్తుంచుకుంటుందన్నారు.