‘అనంత’లో ప్రైమరీస్కూల్ హెడ్మాస్టర్ దాష్టీకం…
అనంతపురం: జిల్లాలోని నేత్రపల్లి ప్రైమరీస్కూల్ హెడ్మాస్టర్ ఓ విద్యార్థిపై వీరంగం సృష్టించాడు. అల్లరిచేస్తున్నాడని ఒకటో తరగతి విద్యార్థి చరణ్(5)ను హెడ్మాస్టర్ బషీర్ అహ్మద్ చితకబాదాడు. దీంతో విద్యార్థికి తలపై బలమైన గాయయింది. బాలున్ని రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.