అనంతలో వైకాపా కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వదం
అనంతపురం: నగరంలోని పాతూరు మహాత్మగాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమానికి వైకాపా ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని ఆహ్వానించాలేదని ఆపార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆ కార్యక్రమాంలో పాల్గోన్నాడానికి వచ్చిన ఎంపీ అనంత వెంకటరామిరెడ్డిని అడ్డుకుని ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడాంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని శాంతింపాజేశారు.