అనర్హులకు గృహలక్ష్మి.. వాటిని రద్దు చేసి అర్హులకు కేటాయించాలి – ఎంపీడీవో కు వినతి పత్రం అందజేసిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు

అనర్హులకు గృహలక్ష్మి.. వాటిని రద్దు చేసి అర్హులకు కేటాయించాలి – ఎంపీడీవో కు వినతి పత్రం అందజేసిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు

గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, సమగ్ర విచారణ జరిపి అనర్హులకు తొలగించాలని కోరుతూ రామగిరి మండల ఎంపీడీవో ఇనుముల రమేష్ కు శనివారం రామగిరి మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పబ్బతి రాధ వినతి పత్రం సమర్పించారు. అర్హులైన నిరుపేదలైన వారికి మాత్రమే పథకం అమలులోకి రావాలని, ఇంతకుముందే ఇల్లు, భవనం ఉన్నవారిని తొలగించి , భూమి ఉండి కట్టుకునే స్థోమత లేని వారిని మాత్రమే గుర్తించి పథకాన్ని అమలులో చేయాలనీ కాంగ్రెస్ పార్టీ మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు రామగిరి ఎంపీడీవోకు ఫిర్యాదు చేయడం జరిగిందని సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగిరి మండల ఉపాధ్యక్షురాలు జాగరి రజిత, ఇజ్జగిరి సంధ్య, ఇజ్జగిరి శారద పాల్గొన్నారు. ప్రభుత్వాలు ప్రజలందరి కోసం పథకాలు తీసుకువస్తుంటే కొంతమంది నాయకులు వల్ల అవి పథకాలు పక్కదారి పడుతున్నాయి అని, కాబట్టి వారిని గుర్తించి అనర్హులని తొలగించాలని వినతి పత్రంలో ఎంపీడీవోను వారు కోరారు.