అనాథ వృద్ధులకు అన్నదానం

పవర్‌హౌస్‌కాలనీ, మే 27, (జనంసాక్షి)

గోదావరిఖనిలోని శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక వృద్ధాశ్రమంలో అనాథ వృద్దులకు ఆదివారం ట్రాఫిక్‌ సీిఐ బి.డేవిడ్‌ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తన వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకుని డేవిడ్‌ – లక్ష్మి దంపతులు వృద్ధుల కు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మశాస్త్ర నిర్వాహకులు కౌటంబాబు, బైసరఘుసింగ్‌, వెంకటి, శ్రీనివా స్‌, సరస్వతి, భారతి తదితరులు పాల్గొన్నారు.