అనుమతి ఇచ్చి, అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌పై ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రాజకీయ జేఏసీ ఆరోపిస్తోంది. మార్చ్‌కు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం మండిపడ్డారు. అక్రమ అరెస్టులను వెంటనే నిలిపివేసి తాము శాంతియుతంగా నిర్వహించకునే మార్చ్‌కు ప్రభుత్వంతోపాటు పోలీసులు సహకరించాలని కోదండరాం, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, జేఏసీ నేత శ్రీనివాస్‌గౌడ్‌లు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మను కోరారు. నెక్లెస్‌ రోడ్డులో నిర్వహించే మార్చ్‌కు రోడ్‌ మ్యావ్‌పై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదని వారు సీపీకి తెలియజేశారు.