కరీంనగర్ బస్టాండ్‌లో బాలుడు అదృశ్యం

కరీంనగర్ బస్టాండ్‌లో తప్పిపోయిన వంశీ రెడ్డి కోసం ఆందోళన – ఆచూకీ తెలిపిన వారికి సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి.

  • ఫోన్ నంబర్స్ 9502118110,8008962891
    ఇల్లంతకుంట జూన్ 12(జనంసాక్షి ) ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన కంకణాల శ్రీనివాస్ రెడ్డి కుమారుడు వంశీ రెడ్డి ఈ నెల 11వ తేదీన కరీంనగర్ బస్టాండ్‌లో కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు, వంశీ రెడ్డి కరీంనగర్ బస్టాండ్ ప్రాంతంలో ఉండగా తప్పిపోయినట్లు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ బంధువులు, స్నేహితుల వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. వంశీ రెడ్డి ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో పాటు కుటుంబ సభ్యులకు తెలియజేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి, బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.