అనుమతి రాగానే లాసెట్ కౌన్సెలింగ్
తిరుపతి: బార్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి రాగానే కౌన్సిలింగ్ నిర్వహిస్తామని లాసెట్ కన్వీనర్ ఆచార్య పాపారావు పేర్కొన్నారు. గతనెల రెండున రాష్ట్రవ్యాప్తంగా లాసెట్ ప్రవేశ పరీక్షను శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం విజయవంతంగా నిర్వహించింది. ఫలితాలను కూడా అదే నెల తొమ్మిదిన విడుదల చేసింది. అభ్యర్థులకు ర్యాంకు కార్డుల్ని పంపారు. నేటి వరకు కౌన్సిలింగ్ తేది ప్రకటించకపోవడంతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు తరచూ వాకబు చేస్తున్నారని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి రాగానే కౌన్సెలింగ్ తేదీని ప్రకటిస్తామని పాపారావు తెలిపారు.