అన్నదమ్ముల దారుణహత్య

గుంటూరు: నగరంలోని శ్రీనివాసరావు పేట అరవై అడుగుల రోడ్డులో శుక్రవారం అర్థరాత్రి ఇద్దరు అన్నదమ్ములు దారుణహత్యకు గురయ్యారు. దుండగులు వీరిని కిరాతకంగా హత్య చేసి పరారయ్యారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమైఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.