అన్నపై కోపం.. తెలంగాణ పైనా..

` నాడు సమైఖ్య శంఖారావం పూరించిన షర్మిల ఏముఖంతో తెలంగాణ యాత్ర చేస్తారు?
` ఆంధ్రాలో అధికారం పంచుకోవడంలో తలెత్తిన విభేదాలు
` వలస పక్షుల్లా తెలంగాణపై దాడి..
` నాడు తెలంగాణకు అడ్డం,నిలువు రాజశేఖర్‌రెడ్డి
` కరీంనగర్‌ సభలో సమైక్యవాదిగా ప్రకటించుకున్న రాజశేఖర్‌రెడ్డి
` హైదరాబాద్‌కు రావాలంటే పాస్‌పోర్టులు కావాలన్నారు
` అవి లేకుండానే వాలిన వలస పక్షులు
` తెలంగాణ పోలీసులపై దాడులకు సైతం తెగబడ్డారు
హైదరాబాద్‌(జనంసాక్షి):వైఎస్‌.షర్మిల.. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌. ఆనాడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జైల్లో ఉన్నపుడు సమైక్యవాద పాదయాత్ర చేపట్టింది. తర్వాత షర్మిల  2014 ఎన్నికల్లో అన్న పార్టీ కోసం ప్రచారం చేసారు. 2019 ఎన్నికల్లోనూ ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతీ సభలో బైబై బాబు అంటూ షర్మిల చేసిన నినాదం ఆ ఎన్నికల్లో వైసీపీ స్లోగన్‌గా మారిపోయింది.జగన్‌ ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన తరువాత కొంత కాలానికే అధికారం పంచుకోడంలో తలెత్తిన విభేదాల కారణంగా తల్లి కూతుర్లు తెలంగాణకి వలస పక్షుల మాదిరి వచ్చారు.  షర్మిల తెలంగాణ వేదికగా రాజకీయం చేయటం జగన్‌ కు ఏ మాత్రం ఇష్టం లేదు. అభ్యంతరం వ్యక్తం చేసారు. కానీ, షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసారు.అన్నతో విభేదించి తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన షర్మిలరు రాజకీయంగా తొలి నుంచి  మద్దతు రాలేదు. తెలంగాణక అడ్డం నిలువు రాజశేఖరరెడ్డి. ఆనాడు తాను వ్యక్తిగతంగా సమైక్యవాదినని కరీంనగర్‌ సభలో ప్రకటించిన విషయం తెలంగాణ ప్రజలు మరవలేదు. అటువంటి కరుడుకట్టిన తెలంగాణ వ్యతిరేకి, సమైక్యవాది రాజశేఖర్‌ రెడ్డి ముద్దుల తనయురాలిగా, తెలంగాణలో వైఎస్సార్‌ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే లక్ష్యంతో సొంత పార్టీ పెట్టుకుని పోరాడుతున్న షర్మిల తెలంగాణ ప్రజల నుండి ఏ మేరకు మద్దతు లభిస్తుందని ఆశిస్తుంది. ప్రతి చోటా రాజన్న రాజ్యం తెస్తానని అంటున్న  షర్మిల ఉద్దేశం ఏమిటి? తెలంగాణకు పాస్‌పోర్ట్‌తో వెళ్లాలని అక్కసు వెళ్లగక్కిన రాజశేఖరరెడ్డి బిడ్డకి తెలంగాణలో తిరిగే హక్కు ఉందా?ఇదంతా అటు వుంచితే అన్నవిూద కోపమా లేక అధికారం కోసంవివాదాలతో దోస్తీ చేస్తున్నారు. రాజకీయాల రాణించే మాటేమిటో కాని ఆమె వ్యవహార శైలి మాత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.ఇదంతా అలా ఉంచితే నిన్నటికి నిన్న పోలీసులతో ఘర్షణ పడిన తీరు, ఆ తర్వాతి పరిణామాలతో రాజకీయంగా రావాల్సిన మైలేజీ కంటే ఎక్కువ అప్రతిష్టను ఆమె మూటగట్టుకోవాల్సి వచ్చింది.షర్మిల వ్యవహారశైలి చూసిన వారెవ్వరైనా రాజకీయ నాయకులు ఇలా కూడా వ్యవహరిస్తారా అనే సందేహం కలుగుతుంది. రాజశేఖర్‌ రెడ్డి కుమార్తె అనే ఏకైక అర్హతతో ఏమి చేసిన చెల్లుతుందనే భావన షర్మిలలో కనిపిస్తుందనే విమర్శ లేకపోలేదు. షర్మిల ఏ కారణాలతో తెలంగాణలో రాజకీయ అస్తిత్వాన్ని వెదుక్కునే ప్రయత్నం చేసినా వాటిని ప్రజలు హర్షించి, స్వాగతించే పరిస్థితులు ఏ మేరకు ఉన్నాయనే ఆలోచన కూడా చేయాల్సి ఉంది. ఈ తరహా వ్యవహార శైలి ఆమెకి  రాజకీయ మైలేజీ తెచ్చిపెట్టక పోగా మరింత దిగ జారే పరిస్థితి వుంది. అటు అన్న తనకు అండగా నిలవలేదు.  ఇటు తెలంగాణ ప్రజల్లో చులకన అవుతూ ఫ్రెస్టేషన్‌లో తాను ఏం చేస్తున్నదో అర్థం లేకండా వ్యవహరిస్తూ పచ్చగా, ప్రశాంతంగా ఉన్న నా తెలంగాణ లో ఈ  ఫ్యాక్షనిస్టు రాజకీయాలు చేయడానికి కూడా తెగించించింది. తల్లి కూతుర్లు ఆంధ్రప్రదేశ్లో అధికారం కోసం ఏదో కుట్ర చేసినట్లు ఉన్నారు అందుకే జగన్‌ వీళ్లను పంపిచేసి  ఉండొచ్చు ఇలా విమర్శలు కూడా తెలంగాణ ప్రజల నుండి  ఎదుర్కొంటున్న షర్మిల అన్న విూద కోపం తెలంగాణ విూద చూపిస్తే ఊరుకునేది లేదని తెలంగాణ ప్రజానీకం హెచ్చరిస్తోంది.