అన్ని రంగాల్లో సూర్యాపేట జిల్లా అభివృద్ధి- మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ బత్తుల ఝాన్సీ రమేష్

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి హయాంలో సూర్యాపేట జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని సూర్యాపేట మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ బత్తుల ఝాన్సీ రమేష్ అన్నారు.జిల్లా కేంద్రంలోని నెహ్రూ నగర్ లో మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ బత్తుల ఝాన్సీ రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.జగదీషన్న కప్ క్రీడా పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ మంత్రి జగదీష్ రెడ్డి సారధ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు.అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు.ప్రజల ఆశీస్సులతో మంత్రి జగదీష్ రెడ్డి రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమన్నారు.ఈ వేడుకల్లో పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.