అన్ని సామాజికవర్గాలకు సర్కార్‌ అండ

share on facebook

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

పెద్దపల్లి,నవంబర్‌11( జనం సాక్షి ): ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని సామాజిక వర్గాలను సమదృష్టితో గౌరవిస్తారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారంలో 7లక్షల రూపాయలతో నిర్మించిన మున్నూరు కాపు సంఘం భవనాన్ని ఈశ్వర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఆయా సామాజిక వర్గాల్లో ఆత్మగౌరవాన్ని మరింత పెంపొందించడంలో భాగంగా కుల సంఘాల భవనాల నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలో 5లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిన్‌ను మంత్రి కొప్పుల ప్రారంభించారు. వ్యాయామంతో శరీర దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం చేకూరి ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల, అధికారులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.