అప్పా వద్ద వేగంగా దూసుకెళ్లిన వాహనం

రోడ్డుదాటుతున్న ఇద్దరు కూలీలు మృతి
రంగారెడ్డి,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): నార్సింగి అప్పా కూడలి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొని ఇద్దరు కూలీలు మృతిచెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతులను కర్ణాటకకు చెందిన భీమప్ప, రాములుగా గుర్తించారు. వాహనం వేగంగా వచ్చి వీరిని ఢీకొన్నట్లు తెలుస్తోంది.