అభ్యర్థుల ఖర్చులకు సంబందించిన రికార్డులు రెండు రోజులలో సమర్పించాలి. ఎన్నికల వ్యయ పరిశీలకులు సమీర్ కుమార్ ఝ

అలంపూర్ నవంబర్ 20(జనంసాక్షి )
ఎన్నికల పోటీలో నిలబడ్డ అభ్యర్థులు, ఖర్చులకు సంబంధించిన బ్యాంకు, క్యాష్, క్రెడిట్ రికార్డులను రెండు రోజుల్లో సబ్ మిట్ చేయాలని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల వ్యయ పరిశీలకులు సమీర్ కుమార్ ఝ ఆదేశించారు.
సోమవారం ఆలంపూర్ నియోజక వర్గం మార్కెట్ యార్డుసమావేశము హాలునందు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల వ్యయ పరిశీలకులు సమీర్ కుమార్ ఝ తొలి పరిశీలనా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలంపూర్ అసెంబ్లీ ఎన్నికల పోటీలో నిలబడ్డ 13 నబ్ది అభ్యర్థుల ఎన్నికల ఖర్చులకు సంబంధించిన రిజిష్టర్లను ఆయన తనిఖీ చేశారు. అన్ని పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల రికార్డులను పరిశీలించి, రిజిష్టర్ లలో అన్ని ఖర్చుల నమోదు తప్పనిసరి అని అన్నారు. సభలు, సమావేశాలు, ప్రచారానికి సంబంధించిన క్యాప్ , ఖండువాలు, జెండాలు, ప్రచురణ కరపత్రాలు, కుర్చీలు, పూల దండలు, టీ కాఫీ, బిస్కట్స్ వంటి వాటి లెక్కలు వారిని అడిగి తెలుసుకున్నారు. నగదుకు సంబంధించిన లెక్కలు ప్రత్యేక రిజిష్టర్ లో నమోదు చేయాలని, చెక్ డిపాజిట్ లు, విత్ డ్రాలకు మరో రిజిష్టర్ ఉండాలన్నారు. రిటర్నింగ్ అధికారి సంతకంతో నామినేషన్ సమయంలో అభ్యర్థులకు అందించిన ఏ, బీ, సీ రిజిష్టర్లలో ఎన్నికల ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అన్నారు.
అనంతరం స్ట్రాంగ్ రూమ్ ను ఎన్నికల మేటిరియాల్ రూమ్ ను పరిశీలించారు.
ఈ సమావేశానికి ఆలంపూర్ రిటర్నింగ్ అధికారి చంద్రకళ , జిల్లా ఉద్యానవన అధికారి అక్బర్, ఎన్నికల వ్యయ అధికారులు, వివిధ రాజకీయ ప్రతినిధులు పాల్గొన్నారు

తాజావార్తలు