అమెరికాలోని దక్షిణ లూసియానాలో భారీ వరదలు

న్యూ ఆర్లీన్స్‌: ఐజాక్‌ తుపాను అమెరికాలోని దక్షిణ లూసియానాలో భిభత్సం సృష్టిస్తోంది. బుధవారం భారీ గాలులు, వర్షాలతో న్యేఆర్లీన్స్‌ నగరం శివారుల్లోని వరద గోడ మీదుగా నీళ్లు కొన్ని అడుగుల పైనుంచి ప్రవహిచాయి. ఏడేళ్ల క్రితం కత్రినా ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన రోజే ఐజాక్‌ విజృంభించింది. ప్లేక్‌ మైన్స్‌ ప్రతినిధి బల్లీ నుగెస్సెర్‌ మాట్లాడుతూ సుమారు 2 వేల మందిని ఆ ప్రాంతం నుంచి ఖళీ చేయించినట్లు చెప్పారు. ఐజాక్‌ దాటికి ఇప్పటికే హైతీ, డొమినికన్‌ రిపబ్లిక్‌లలో భారీ నష్టం సంభవించింది. 23 మంది మృతిచెందారు. ఐజాక్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు లూసియానా గవర్నర్‌ బాబీ జిందాల్‌ చెప్పారు. సుమారు వెయ్యి మంది సైనిక బలగాలను మోహరించారు.