అమెరికాలో ఉన్మాది కాల్పులు-ముగ్గురి మృతి-అనంతరం నిందితుడి ఆత్మహత్య

వాషింగ్టన్‌: హ్యూష్టస్టన్‌: అమెరికాలోని విస్కాన్సిన్‌లో మరో ఉన్మాది కాల్పులకు తెగబడ్డాడు. గడిచిన మూడు నెల్లో విస్కాన్‌లో జరిగిన రెండో కాల్పుల ఘటన ఇది. ఆదివారం ఇక్కడ బ్యూటీ స్పాలో చొరబడిన ఆప్రికన్‌ అమెరికన్‌ రాడ్‌క్లిఫ్‌హాటన్‌(45) విచక్షణ రహితంగా కాల్పులు జరపటంతో ముగ్గురు మహిళలు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం హాటన్‌ తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం విడిగా ఉంటున్న హాటన్‌ భార్య అదే స్పాలో పని చేస్తున్నట్లు తెలిసింది. మృతుల్లో ఆమె కూడా ఉందా,? లేదా.? అనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు వివరించారు. రెండు వారాల కిందట భార్యతో గొడవ పడిన కేసులో హాటన్‌పై నిషేదాజ్ఞలతో పాటు అతని వద్ద ఉన్న ఆయుధాలను అప్పగించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఘటనపై అధ్యక్షుడు ఒబామా విచారం వ్యక్తం చేశారు. ఇది ఉగ్రవాద చర్య కాదని ఒబామా జాతీయ భద్రతాధికారులతో చెప్పినట్లు శ్వేత సౌధం మీడియా కార్యదర్శి జే.కార్నె చెప్పారు.