అమెరికా వీసా రుసుము పెంపుపై భారత్‌ ఫిర్యాదు

న్యూఢిల్లీ: అమెరికా వీసా రుసుము పెంపుపై భారత్‌ త్వరలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)కు ఫిర్యాదు చేసే అవకాశముంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఆ సంస్థకు అందించేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ సైతం చర్యలు ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆమెరికా వీసా పెంపుపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించాం దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నిటినీ డబ్ల్యూటీవో ముందు అక్టోబరు ఆఖరులోపు ఉంచుతాం ఆ వీసా రుసుము పెంపు భారత ఐటీ సంస్థలపై వివక్ష చూపడమే అని తెలిపారు.