అమ్మఒడి ఆధ్వర్యంలో అన్నదానం.
పోటో రైటప్: అన్నదానం చేస్తున్న సభ్యులు.
బెల్లంపల్లి, సెప్టెంబర్ 4, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియా బస్టాండ్ వద్ద ఆదివారం అమ్మఒడి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈసందర్భంగా అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టు బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ హనుమండ్ల మదుకర్ మాట్లాడుతూ అన్నమో రామచంద్ర అని ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలి బాధను తగ్గించడానికి తమ వంతు సాయంగా 05-04-2020 నాడు ప్రారంభించామని, పట్టణంలో ప్రతి ఆదివారం నిర్విరామంగా కొనసాగించాలనే సదుద్దేశంతో దాతల సహకారంతో నేటి వరకు 144వ సారి అన్నదానం కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా పల్లెటూరి బస్టాండు వద్ద యచకులకు, నిరుపేదలకు, కూలీలకు, బాటసారులకు, సుమారు 200 మందికి అన్నదానం చేసినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో అమ్మఒడి సభ్యులు సువర్ణ, మల్లక్క, గన్నెవరం తిరుమల చారి, రంగ సురేష్, సిద్ధమల్ల రఘు, మేడిపల్లి రమేష్, లెంకల శ్రావణ్ కుమార్, ఎండి యూసుఫ్, చెందుపట్ల లింగన్న, వంగ సతీష్ గౌడ్ పాల్గొన్నారు