అలంపూర్ అభివృద్ధి పై బిఆర్ఎస్ నాయకులు చర్చకు సిద్ధమా? బిఎస్పీ జిల్లా అధ్యక్షులు కేశవరావు

అలంపూర్ జూన్ 7(జనంసాక్షి) అలంపూర్ నియోజకవర్గం లో తుమ్మిళ్ల ఎత్తిపోతల రిజర్వాయర్లు పూర్తి చేయకుండానే తెలంగాణ నీటి పారుదల పై బిఆర్ఎస్ పార్టీ దశాబ్ది ఉత్సవాలు జరపడం సిగ్గుచేటు అని బిఎస్పీ జిల్లా అధ్యక్షులు కేశవ రావు అన్నారు.బుధవారం అలంపూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాలకు వ్యతిరేకంగా బిఎస్పీ నాయకులు ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా కేశవరావు మాట్లాడుతూ, ఆర్డీఎస్ రిజర్వాయర్ విషయంలో అలంపూర్ ప్రజలను మోసం చేసి నీటిపారుదల దశాబ్ది ఉత్సవాలు జరపడం సిగ్గుచేటని అన్నారు.మల్లమ్మ కుంట, జూలకల్, వల్లూరు రిజర్వాయర్లను పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఆర్డీఎస్ ని పూర్తి చేయడంలో కేసీఆర్ నిర్లక్ష్యం వహించడమే కాక కుర్చి వేసుకొని పూర్తి చేస్తానని హామీ ఇచ్చి మర్చిపోవడం అలంపూర్ ప్రజలు మర్చిపోలేదన్నారు.అలంపూర్ అభివృద్ధి విషయంలో బిఆర్ఎస్ నాయకులు చర్చకు సిద్ధమా అని వారికి సవాలు విసిరారు.తమ ఫార్మ్ హౌస్ కి నీళ్లు తెచ్చుకోవడానికి ఎంతో ఖర్చు చేసిన కేసీఆర్ అలంపూర్ అభివృద్ధికి ఎంత ఖర్చు చేశారో చెప్పాలన్నారు.తదనంతరం బిఎస్పీ నాయకులు ఏక్ నోట్ – ఏక్ ఓట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.అలంపూర్ పట్టణ కేంద్రంలోని ప్రతి షాపు తిరిగి ప్రతి ఒక్కరి దగ్గర కనీసం ఒక్క రూపాయి వసూలు చేసి ఓటు కూడా వేయాలని అభ్యర్థించారు.దాని తరువాత అలంపూర్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అలంపూర్ ప్రజల కోరిక మేరకు అలంపూర్ ప్రతి గుంటకు నీరు పారేలా చేయాలని మరియు వరద బాధితులకు ఇండ్లు పంపిణీ చేయాలని మరి పెన్షన్స్ ఇవ్వాలని కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాలని ఒక వినతి పత్రాన్ని రాసి తహసిల్దార్ కి అందించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందికంటి విజయ్ కుమార్ , జిల్లా అధ్యక్షులు ఎంసీ జిల్లా ఇంచార్జి ఎంజి కృష్ణ, నియోజకవర్గ అధ్యక్షులు మహేష్, నియోజకవర్గ ఇంచార్జి మధుగౌడ్,నియోజకవర్గ ప్రధాననియోజకవర్గ ఉపాధ్యక్షులు యామని సుంకన్న, మండల అధ్యక్షుడు నాగరాజు,మండల కన్వీనర్ సురేష్,సుధాకర్,రాజోలి మండల అధ్యక్షులు వెంకటేష్,ఇటిక్యాల మండలం అధ్యక్షులు తిరుపాల్, మహేందర్, నాగేంద్ర,తదితరులు పాల్గొన్నారు.