అలయాల్లో చోరిలకు నిరసనగా భక్తుల అందోళన
హైదరాబాద్ : పాతబస్తీ ప్రాంతంలోని మహంకాళి అమ్మవారి అలయాల్లో వరుసగా జరుగుతున్న చోరీలకు నిరసనగా భక్తులు అందోళనకు దిగారు. నిన్న అర్థరాత్రి దొంగతనం జరిగిన ఉప్పగూడ మహంకాళి అలయం వద్దకు ఈ ఉదయం పెద్దసంఖ్యలో స్థానికులు చేరుకోని నిరసన చేపట్టారు. లాల్ దర్వాజ మహంకాళి అలయంలో చోరీ ఘటన మరవకముందే మరో ఘటన చోటుచేసుకోవడంపై అగ్రహం వ్యక్తం చేశారు. పోలిసుల నిఘా వైఫల్యం. నిరంతరం గస్తే లేకపోవడం వల్లే దోంగలు . రెచ్చిపోతున్నారని.అరోపించారు.



